టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలవలేదన్న వడ్డీ రఘురాం
రిపోర్టర్: విజయ్
స్థలం: Tadepalligudem
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని ఈడీ దర్యాప్తులో తేలిపోయిందని తాడేపల్లిగూడెం వైయస్‌ఆర్‌సీపీ ఇంఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, లడ్డూ ప్రసాదంపై గతంలో జరిగిన దుష్ప్రచారంలో నిజం లేదని తేలిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.