ప్రజా సేవ అనేది వ్యక్తిగత గొప్పతనం కాదు: ఐఏఎస్ అధికారి తుకారాం ముండే
రిపోర్టర్: మహేష్
స్థలం: మహారాష్ట్ర
ప్రజా సేవ అనేది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించినది కాదని, అది సమష్టి బాధ్యత అని మహారాష్ట్ర ఎఫ్డీఏ కమిషనర్ తుకారాం ముండే స్పష్టం చేశారని సీనియర్ అధికారులు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా తనను హీరో అని ప్రశంసించడంపై ముండే స్పందిస్తూ, ప్రభుత్వ అధికారుల నిజాయితీని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదని, అది విధి నిర్వహణలో భాగమేనని తేల్చిచెప్పారు. అపరిశుభ్ర వంటగదులు, కల్తీ ఆహారాలపై ఆయన చేస్తున్న దాడులకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.