ఎత్తిపోతల పథకాలకు నిరాటంకంగా విద్యుత్ అందించాలని సీఎం రేవంత్ ఆదేశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు, సాగు అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లు విద్యుత్ కొనుగోలు చేయాలని అధికారులతో సమావేశంలో స్పష్టం చేశారు. థర్మల్ కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని, జెన్కోకు నాణ్యమైన బొగ్గు అందించాలని ఆదేశించారు.