ట్రైలర్ లాంచ్: తొలి ఇండియన్ స్లాషర్ థ్రిల్లర్‌గా వస్తున్న విశ్వక్సేన్ కల్ట్ సినిమా
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
నటుడు విశ్వక్సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ సినిమా గ్లోబల్ కంటెంట్‌తో వస్తోందని, ఈ నెల ముప్పైవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆయన తెలిపారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో ఇంటెన్స్ డ్రామాతో పాటు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఉంటాయని, గోవా ఐలాండ్ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని మేకర్స్ స్పష్టం చేశారు.