భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మకు మొక్కులు చెల్లించుకున్న భైరి విశ్వనాథం దంపతులు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తరిగొప్పల
జనగామ జిల్లా తరిగొప్పల మండలం సోలింపురం గ్రామంలో నల్ల పోచమ్మ దేవాలయాన్ని సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భైరి విశ్వనాథం గౌడ్, విజయలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో భైరి నిహారిక, విష్ణు, బైరగోని కవిత, శ్రీనివాస్, కొయ్యాడి యాదగిరి, హిమశ్రీ తదితరులు పాల్గొన్నారు.