బెంగళూరులో భారీ పేలుడు ఘటన: ఇద్దరు భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర గాయాలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: Bengaluru
బెంగళూరులోని పులకేశి నగర్ ప్రాంతంలో ఉన్న నిర్మాణంలో ఉన్న భవనంలో జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. జర్మియా రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో అల్లాఉద్దీన్, సూరజ్ అనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బోరింగ్ ఆసుపత్రికి తరలించారు. పేలుడుకు అసలు కారణం ఇంకా తెలియరాలేదని, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలాన్ని పరిశీలించి లోతుగా దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.