రూ.3.80 కోట్ల ధరతో మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆవిష్కరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ భారత మార్కెట్లో తన కొత్త మెర్సిడెస్-AMG G 63 ఆఫ్‌రోడ్ ప్రో వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 3.80 కోట్లుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ప్రత్యేకమైన AMG హార్డ్‌వేర్, అదనపు పరికరాలతో వస్తున్న ఈ లగ్జరీ వాహనం మార్కెట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.