కేంద్ర ఎన్నికల సంఘం నిరంకుశ నిర్ణయాలపై రఘువీరారెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: నరేష్ స్థలం: అనంతపురం

కేంద్ర ఎన్నికల సంఘం అనుసరిస్తున్న నిరంకుశ నిర్ణయాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్. రఘువీరారెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లా మడకశిరలో నిర్వహించిన నిరసనలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాల నుంచి అర్హుల పేర్లను అక్రమంగా తొలగించారని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజల అనుమానాలను వెంటనే నివృత్తి చేయాలని, భవిష్యత్తులో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.