దిల్లీలో విషాదం: ఆసియా పారా గేమ్స్ విజేత నీరజ్ యాదవ్ మృతి
రిపోర్టర్: శివ
స్థలం: Delhi
ప్రముఖ పారా అథ్లెట్, మూడుసార్లు ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ దిల్లీలో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో క్రీడా లోకంలో తీవ్ర విషాదం అలుముకుందని తోటి క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీటీబీ ఆసుపత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.