సంజూ శాంసన్‌కు టీమిండియా టాప్ త్రీలో చోటు ఇవ్వాలి: రహానే

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు మేనేజ్‌మెంట్ సముచిత స్థానం కల్పించాలని మాజీ బ్యాటర్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్‌లో అద్భుతంగా రాణించిన సంజూ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ త్రయమే టాప్ త్రీలో కొనసాగాలని స్పష్టం చేశారు. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమవ్వగానే అతడిని పక్కన పెట్టడం సరికాదని, తిరుగులేని మ్యాచ్ విన్నరైన సంజూ జట్టులోకి రావడం మరింత బలాన్నిస్తుందని ప్రశంసించారు.