రాయలసీమ ఉద్యానహబ్ ప్రచార కార్యక్రమాలపై కలెక్టర్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

రాయలసీమ అంతర్జాతీయ ఉద్యానహబ్ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఐహెచ్ డీపీ కార్యక్రమాన్ని అక్టోబరు రెండున కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు ఇరవై ఆరు నుంచి నాలుగు దశల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన శనివారం కలెక్టర్లతో మాట్లాడారు. ప్రతి జిల్లాలో ఇంచార్జి మంత్రి ఆధ్వర్యంలో క్లస్టర్లు, విస్తీర్ణం, ప్రయోజనం పొందే రైతుల వివరాలను తెలపాలని ఆయన స్పష్టం చేశారు.