విద్యార్థులకు అలర్ట్: క్లాట్ 2027 దరఖాస్తు గడువు పొడిగింపు
రిపోర్టర్: గోపి
స్థలం: న్యూఢిల్లీ
నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ క్లాట్ 2027 దరఖాస్తు గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా నవంబర్ 7వ తేదీ వరకు దరఖాస్తులను సమర్పించవచ్చని తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష డిసెంబర్ 6వ తేదీన జరగనుందని నిర్ధారించారు.