వృద్ధులకు వికలాంగులకు మాజీ సర్పంచ్ అండగా
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నారువ గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్ నిద్రభంగి రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులు మరియు వికలాంగులకు ఆహార పదార్థాలను పంపిణీ చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గురువారం రాత్రి ప్రధానమంత్రికి దీర్ఘాయుష్ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్థానిక నాయకులతో కలిసి ఆశీర్వాద దీపం వెలిగించారు.