బెల్లంపల్లి ఇసుక మాఫియాపై కలెక్టర్ కు ట్రాక్టర్ యజమానుల ఫిర్యాదు
రిపోర్టర్: NARESH
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో సాగుతున్న అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయాలని కోరుతూ ట్రాక్టర్ యజమానులు సోమవారం కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు సమర్పించారు. అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటంతో పాటు తమ ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మైనింగ్, రెవెన్యూ మరియు పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.