చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో లంబాడా సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ముందస్తు అరెస్టు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో లంబాడా హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ను జన్నారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గిరిజనులకు ఇచ్చిన పన్నెండు హామీలను అమలు చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాలని, సేవాలాల్ జయంతికి అధికారిక సెలవు ప్రకటించాలని కోరుతూ ఈ ఆందోళనకు పిలుపునిచ్చినట్లు తెలిపారు.