యువత అన్ని రంగాలలో రాణించి దేశాభివృద్ధికి కృషి చేయాలి

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

యువత అన్ని రంగాలలో రాణించి దేశ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్ లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సృజనాత్మకత, కళా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయికి వెళ్లే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.