9/11 దాడులను ఆపడంలో మేము విఫలమయ్యామన్న అమెరికా మాజీ అధికారి
రిపోర్టర్: వెంకట్
స్థలం: World
అమెరికాలో జరిగిన 9/11 ఉగ్రదాడులను నివారించడంలో అధికారుల వైఫల్యంపై ఓ సీనియర్ మాజీ భద్రతా అధికారి సంచలన ప్రకటన చేశారు. ముప్పు స్వభావాన్ని తాము ముందే గుర్తించలేకపోయినట్లు అంగీకరించారు. బాధితుల కుటుంబాలు ఎదుర్కొన్న క్షోభకు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరారు. దాడులు జరిగి పాతికేళ్లు గడుస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.