స్థానిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై విజయవాడలో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

రిపోర్టర్: మహేష్ స్థలం: విజయవాడ

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు మరియు సంసిద్ధతపై విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, నగర పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి సిద్ధమైన ఓటర్ల జాబితానే ప్రాతిపదికగా తీసుకుంటామని, బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే విడతల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామని అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు.