నెల్లూరులో తూనికలు కొలతల శాఖ నిర్లక్ష్యం: దాడులు లేక మోసపోతున్న ప్రజలు
రిపోర్టర్: హరి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో తూనికలు కొలతల శాఖ సిబ్బంది కొరతతో అల్లాడుతోంది. తనిఖీలు లేకపోవడంతో దుకాణాల్లో వినియోగదారులకు తెలియకుండానే భారీగా మోసాలు జరుగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో వేల సంఖ్యలో వ్యాపార దుకాణాలు ఉన్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించి తనిఖీలు ముమ్మరం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.