నాగార్జున వందో సినిమాలో నటి టబు: ప్రత్యేక గ్లింప్స్ విడుదలపై చిత్ర యూనిట్ ప్రకటన
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
టబు పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ నవంబర్ నాల్గవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక వందో సినిమాలో నటి టబు కీలక పాత్ర పోషిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై కలిసి కనిపించనుండటంతో అభిమానుల్ లో ఆసక్తి పెరిగింది. ఆర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.