గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు తప్పనిసరి
రిపోర్టర్: మహేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. అక్రమ కనెక్షన్లు వదిలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సచివాలయాలు, మీ-సేవ కేంద్రాలు లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే వైరింగ్ చేయించాలని కోరారు.