తిరుమలలో వైభవంగా హనుమంత వాహనసేవ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుమల

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముని అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. భక్తజన బృందాల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ ఈ సేవ వైభవంగా సాగింది. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోవింద నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు.