పులివెందులలో నిబంధనల ఉల్లంఘనపై వైఎస్ జగన్ పై కూటమి నేతల ఫిర్యాదు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పులివెందులలో ఆందోళనకు దిగిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్చంద్ర పునేఠాను కూటమి నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పోలింగ్ సమయంలో వైకాపా నాయకులు అరాచకాలు సృష్టించారని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వారు తీవ్రంగా మండిపడ్డారు.