రాబోయే ఎన్నికల కోసం పీడీఏ రథయాత్ర ప్రారంభించిన అఖిలేష్ యాదవ్
రిపోర్టర్: సతీష్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్ లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లక్నో నుంచి రాయ్‌బరేలీ వరకు పీడీఏ రథయాత్రను ప్రారంభించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు మరియు మైనారిటీల కూటమిపై దృష్టి సారిస్తూ ఈ ప్రచారాన్ని చేపట్టారు. ఈ యాత్ర ద్వారా కుల ప్రాతిపదికన ప్రజలను సమీకరించడంతో పాటు పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నట్లు ఎస్పీ వర్గాలు స్పష్టం చేశాయి.