దుర్గపు సుజాత అకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
మనకొండూర్ నియోజకవర్గం తాడికల్ గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు దుర్గపు సుజాత మృతి పట్ల ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారిని స్మృతించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు.