ఉత్తరప్రదేశ్లో భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
రిపోర్టర్: కిరణ్
స్థలం: లక్నో
ఉత్తరప్రదేశ్లో వచ్చే రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెడ్ అలర్ట్ జాల్ చేసిన జిల్లాల్లో పాఠశాలలను మూసివేయాలని ఆయన ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు.