బెంగళూరు నగర జీవన విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

రిపోర్టర్: సునీల్ స్థలం: బెంగళూరు

దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే బెంగళూరు నగరంలో సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవన విధానంపై ఐసిరి అనే మహిళ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీసింది. ఇరవై ఐదు లక్షల వార్షిక వేతనం, రెండు గంటల ప్రయాణం, ముప్పై ఐదు వేల అద్దెతో కూడిన జీవితమే విజయమని యువత భావిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విశ్లేషణపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ మెట్రో నగరాల్లో ఉద్యోగాల కోసం పడుతున్న కష్టాలను వెల్లడించారు.