బెంగళూరులో దారుణం: రాంగ్ రూట్ ప్రశ్నించిన యువతిపై హెల్మెట్ తో దాడి

రిపోర్టర్: శివ స్థలం: బెంగళూరు

బెంగళూరులోని ఇట్టిమడు ప్రాంతంలో రాంగ్ రూట్ లో వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ప్రశ్నించిన ముప్ పై ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి హెల్మెట్ తో విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితురాలి స్నేహితుడు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సరైన మార్గంలో వెళ్లాలని సూచించినందుకు ఆ దంపతులు యువతిని వెంబడించి మరీ అపార్ట్మెంట్ లోపల భౌతిక దాడికి పాల్పడటంతో పాటు పెయింట్ బకెట్ తో కొట్టడంతో మెడపై తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.