సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: నరేష్ స్థలం: అమరావతి

రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వీలుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీకి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో అధికారికంగా ఆమోదం లభించింది. డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రభుత్వ సందేశాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించారు. ఫాలోవర్ల సంఖ్య ఆధారంగా ఇన్‌ఫ్లుయెన్సర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ప్రత్యామ్నాయంగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.