యాదగిరిగుట్ట లడ్డూ ప్రసాదం నాణ్యత లోపంపై భక్తుల తీవ్ర ఆవేదన
రిపోర్టర్: రాము
స్థలం: యాదగిరిగుట్ట
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో విక్రయించే లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపిస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా లడ్డూ పచ్చిముద్దలా మారుతుండటంతో మనోభావాలు దెబ్బతింటున్నాయని వారు వాపోతున్నారు. యంత్రాల ద్వారా తయారీ కారణంగా బూందీ మెత్తబడుతోందని అధికారులు వెల్లడించారు. దిట్టం ప్రకారం సరకులు వాడుతున్నప్పటికీ, పచ్చిలడ్డూల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆలయ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రసాదం రుచి, నాణ్యత పెంచేలా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.