విక్రమ సింహపురి యూనివర్సిటీలో అవినీతి బట్టబయలు: న్యాయవాదుల సంచలన ఆరోపణలు
రిపోర్టర్: sujith reddy
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు ప్రెస్ క్లబ్లో న్యాయవాదులు లెక్కల రాజశేఖర్ రెడ్డి, పట్రంగి అమృత్ కుమార్ విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారీ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్వీయూలో రెగ్యులర్ పీహెచ్డీ చేస్తూనే నిబంధనలకు విరుద్ధంగా వీఎస్యూలో గెస్ట్ ఫ్యాకల్టీగా వేతనం పొందిన బి.వెంకట సుబ్బారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్చార్జి రిజిస్ట్రార్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ల అక్రమ ఆస్తులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.