లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మొయినాబాద్ మున్సిపల్ అధికారులు
రిపోర్టర్: saikiran
స్థలం: శేరిలింగంపల్లి
భవన నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బాధితుడి వద్ద నుంచి రూ. 75,000 లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ మొయినాబాద్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గుండు వాణి, సీనియర్ అసిస్టెంట్ ఎలమోని సుదర్శన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.