గోదావరి పుష్కరాల వేళ రైలు కమ్‌ రోడ్డు వంతెన దుస్థితి

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: తూర్పు గోదావరి

గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో రాజమహేంద్రవరంలోని రైలు కమ్‌ రోడ్డు వంతెన మరమ్మతులు రెండేళ్లుగా अधాపెండాలో నిలిచాయి. వంతెన రక్షణ గోడలు శిథిలమై, ఇనుప ప్లేట్లు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. నడకదారిలో చెత్త, పిచ్చిమొక్కలతో పాటు సామగ్రిని నిర్లక్ష్యంగా పడేశారు. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పనులను వెంటనే వేగవంతం చేసి పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.