పోలీస్ ఉద్యోగార్థులకు అండగా ఖమ్మంలో భారీ ఉచిత మోడల్ టెస్ట్
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
నవంబర్ ఆరున ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక మోడల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి చింతల రమేష్ తెలిపారు. ఈ పరీక్ష విజయవంతం చేసేందుకు కోచింగ్ సెంటర్లు మరియు స్టడీ సర్కిళ్లలో విస్తృతంగా ప్రచారం చేపట్టామన్నారు. నిపుణులైన అధ్యాపకులతో రూపొందించిన ప్రశ్నపత్రంతో ఈ పరీక్ష జరుగుతుందని పేర్కొంటూ అభ్యర్థులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.