పాకిస్తాన్ క్రికెట్లో కలకలం: సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటనలో తీవ్ర జాప్యం

రిపోర్టర్: రమేష్ స్థలం: లాహోర్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో అంతర్గత విభేదాల కారణంగా సెంట్రల్ కాంట్రాక్టుల ప్రకటన తీవ్రంగా ఆలస్యం అవుతోందని క్రీడా విశ్లేషకులు వెల్లడించారు. గడువు ముగిసి రెండు నెలలు దాటినా ఇప్పటివరకు కొత్త ఒప్పందాలను ఖరారు చేయలేదని తెలిపారు. స్టార్ ప్లేయర్ల కేటగిరీల తగ్గింపు కోసమే బోర్డు ఈ జాప్యం చేస్తోందని, దీనివల్ల ఆటగాళ్లకు జీతాలు, మ్యాచ్ ఫీజుల చెల్లింపులు నిలిచిపోయాయని, ఈ వ్యవహారంపై సీనియర్ ఆటగాళ్లు తీవ్ర అసంత్రప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.