చమచింతలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన వైఎస్సార్సీపీ నేతలు

రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు స్థలం: నాథవరం

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం చమచింత గ్రామంలో మాజీ వైస్ ఎంపీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి అభ్యర్థి అంకంరెడ్డి సౌమ్య మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. ఎంపీటీసి అభ్యర్థి పాసిల రాణిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె స్థానిక ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.