ది ప్యారడైజ్ మూవీలో తన సన్నివేశాలు తొలగించారన్న నటుడు రెమో రహీమ్
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా నిడివిని తగ్గించే క్రమంలో తన పాత్రకు సంబంధించిన సుమారు ఏడు నిమిషాల సన్నివేశాలను ఎడిటింగ్‌లో తొలగించినట్లు నటుడు రెమో రహీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సినిమాపై వస్తున్న వ్యతిరేక ప్రచారాన్ని నమ్మకుండా ప్రేక్షకులు థియేటర్లలో స్వయంగా సినిమా చూడాలని ఆయన సూచించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి ఆరంభం లభించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.