స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక కసరత్తు: అమరావతిలో ఎస్ఈసీ ఉన్నత స్థాయి సమీక్ష
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించిందని ఎస్ఈసీ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు. విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసులు పరిష్కారమై, ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పుర, నగరపాలక సంస్థలకు ఒక దశలోనే పోలింగ్ ఉంటుందని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన వెల్లడించారు.