తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ప్రయాణం: నిర్మాతగా అడుగుపెడుతున్న వెంకీ కుడుముల
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
అక్కినేని నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న ఇట్లు అర్జున చిత్రంతో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారుతున్నట్లు తెలిపారు. వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మహేష్ ఉప్పల తెరకెక్కిస్తున్న ఈ సినిమా ద్వారా అనీష్ హీరోగా పరిచయం అవుతున్నారని ఆయన వెల్లడించారు. నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోందని, బలమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని వెంకీ కుడుముల పేర్కొన్నారు.