అడ్డగూడూరు మండలంలో బార్గేట్లను ఢీకొన్న కారు ఇద్దరికి గాయాలు

రిపోర్టర్: Srinivasulu akavaram స్థలం: మోత్కూరు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి గొట్టిపర్తికి వెళ్తున్న కారు అదుపుతప్పి సర్వీస్ రోడ్డు ప్రారంభంలో ఏర్పాటు చేసిన బార్గేట్లను ఢీకొట్టింది. చౌల్లరామారం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.