బైక్పై గణేశ్ శోభాయాత్ర మార్గాలను పరిశీలించిన సీపీ సజ్జనర్

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

గణేశ్ నిమజ్జన శోభాయాత్ర సాగే ప్రధాన మార్గాలను బైక్పై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్ స్వయంగా పర్యటించి పరిశీలించినట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ వెల్లడించారు. నగరంలో శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా అన్ని ముందస్తు భద్రతా ఏర్పాట్లను పరిశీలించామని అధికారులు తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు తావులేకుండా పోలీసుల నిబంధనలకు అనుగుణంగా సహకరించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరారు.