అర్నాబ్ తుపాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నాబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 112 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. తీర ప్రాంతాలు, సముద్రం, వరద ప్రాంతాలకు వెళ్లవద్దని, విద్యుత్ స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, వదంతులను నమ్మవద్దని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.