పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Andhra Pradesh
పట్టణాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ పట్టణం నాది, పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పది మంది మెచ్చుకునేలా పట్టణాలను తీర్చిదిద్దేందుకు అధికారులు అంకితభావంతో పనిచేయాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.