ఆమనగల్లు ఎక్సైజ్ సీఐగా బాధ్యతలు చేపట్టిన పటేల్
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్లు
ఆమనగల్లు ఎక్సైజ్ సీఐగా బి. పటేల్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ అమీర్పేట నుంచి బదిలీపై వచ్చిన ఆయనకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఆయన అధికారికంగా తన బాధ్యతలను చేపట్టారు.
ఇక్కడ మూడేళ్లుగా సేవలందించిన బద్యనాథ్ చౌహాన్ మెదక్ ఎన్ఫోర్స్మెంట్ సీఐగా బదిలీ అయ్యారు. నాటు సారా, గంజాయి నిరోధంలో చౌహాన్ చేసిన కృషిని స్థానికులు అభినందిస్తున్నారు. నూతన సీఐ పటేల్ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.