లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారానికి ఎస్పీ జానకి ప్రత్యేక ఆదేశాలు
రిపోర్టర్: హరి
స్థలం: మహబూబ్ నగర్
మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి కోర్టు లైజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 12న జరగనున్న లోక్ అదాలత్‌లో గరిష్ట సంఖ్యలో కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. 'రాజీ మార్గమే రాజమార్గం' అని పేర్కొన్న ఎస్పీ, కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి సమయం, ధనం ఆదా చేయాలని, కేసుల పరిష్కారం ద్వారా సమాజంలో శాంతిని పెంపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.