సీతారాంపురంలో పొన్నెబోయిన చంచల బాబు పుట్టినరోజు వేడుకలు జరిపిన అభిమానులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: సీతారాంపురం
సీతారాంపురం బస్టాండ్ సెంటర్ నందు యాదవ్ యూత్ ఆధ్వర్యంలో మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చంచల బాబు యాదవ్ 58వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థించారు.