గత ప్రభుత్వంలోనే పీహెచ్సీ మంజూరు: స్పీకర్ శంకుస్థాపనపై ఉమాశంకర్ గణేష్ ధ్వజమెత్తారు
రిపోర్టర్: రుత్తల నాగేశ్వరరావు
స్థలం: నర్సీపట్నం
గొలుగొండ మండలం చీడిగుమ్మలలో పీహెచ్సీ భవన నిర్మాణ శంకుస్థాపనపై వైఎస్ఆర్సీపీ నేత ఉమాశంకర్ గణేష్ స్పందించారు. వైఎస్ జగన్ హయాంలోనే 2021 సెప్టెంబర్ 15న రూ. 2.50 కోట్లతో ఈ ఆసుపత్రి మంజూరైందని వెల్లడించారు. భవనం లేకపోయినా గత మూడేళ్లుగా పాత పంచాయతీ కార్యాలయంలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు సహా పదకొండు మంది సిబ్బందితో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు.