ఉపాధ్యాయుల జోలికొస్తే దబిడి దిబిడేనని మంత్రి లోకేష్ హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: అనంతపురం

అనంతపురం జిల్లా రాప్తాడులో ఎన్టీఆర్, పరిటాల రవి విగ్రహాల ఆవిష్కరణ సభలో మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉపాధ్యాయుల జోలికొస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దబిడి దిబిడేనని హెచ్చరించారు. డీఎస్సీపై చర్చకు తాను సిద్ధమని, జగన్ రెడ్డి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకు పోరాడిన పరిటాల రవి సేవలను, టీడీపీ కార్యకర్తల త్యాగాలను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.