ఘనంగా జై గౌరీపుత్ర గణేశా ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ఫిలిం చాంబర్‌లో ‘జై గౌరీపుత్ర గణేశా’ సినిమా ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. స్వామి శ్రీవాత్సల్య ధర్మ వీర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విద్యార్థుల మానసిక ఒత్తిడి, నైతిక విలువలపై సందేశాత్మకంగా రూపొందింది. ఈ కార్యక్రమంలో తుమ్మల ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.