టీడీపీ కేంద్ర వర్క్షాప్లో పాల్గొన్న బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న వర్క్షాపులో బొబ్బిలి శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీనాయన) సోమవారం పాల్గొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఈ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కళా వెంకటరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, నాయకులు కిమిడి నాగార్జున, కర్రోతు బంగార్రాజు తదితరులు హాజరయ్యారు. పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.